ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చి... పోలీసుల ముందే జగిత్యాల రైతు ఆత్మహత్యాయత్నం
జగిత్యాల : ప్రభుత్వ అధికారుల తీరుతో విసిగిపోయి ఎక్కడ తన భూమి దక్కదోనన్న మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల : ప్రభుత్వ అధికారుల తీరుతో విసిగిపోయి ఎక్కడ తన భూమి దక్కదోనన్న మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు దమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతు గాజుల సాంబయ్య వెళ్ళాడు. అయితే ఆయనవద్ద పురుగులమందు డబ్బాను గుర్తించిన పోలీసులు ఆపారు. ఈ క్రమంలో అక్కడే పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన వ్యవసాయ భూమిని రికార్డుల్లోంచి తొలగించారని... ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా తిరిగి రికార్డులో చేర్చడంలేదని సాంబయ్య తెలిపారు. అందుకే ప్రజావాణిలో కలెక్టర్ కు బాధ చెప్పుకుందామని వచ్చానని రైతు తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని ప్రజావాణికి వెళ్లనివ్వకుండా పోలీసులు స్టేషన్ కు తరలించారు.