మహిళలూ... పిల్లల్లాగే మొక్కలనూ జాగ్రత్తగా పెంచుదాం..: యాంకర్ సుమ పిలుపు

హైదరాబాద్ : ఆడవాళ్ళు పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతారో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచి భావి తరాలకు మంచి వాతావరణాన్ని కానుకగా ఇద్దామని ప్రముఖ యాంకర్ సుమ కనకాల పిలుపునిచ్చారు.

First Published Mar 5, 2023, 1:07 PM IST | Last Updated Mar 5, 2023, 1:07 PM IST

హైదరాబాద్ : ఆడవాళ్ళు పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతారో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచి భావి తరాలకు మంచి వాతావరణాన్ని కానుకగా ఇద్దామని ప్రముఖ యాంకర్ సుమ కనకాల పిలుపునిచ్చారు.ప్రతి మహిళా మొక్కలు నాటి ఈ వుమెన్స్ డే ను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈ వుమెన్స్ డే న మహిళలు పెద్దఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని విజయవంతం చేద్దామని అన్నారు. 

 వుమెన్స్ డే ను పురస్కరించుకుని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు సుమ. ఈ సందర్భంగా మహిళలకు అడ్వాన్స్ గా హ్యాపీ వుమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు యాంకర్ సుమ.