టీఎస్ ఐపాస్ ద్వారానే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి : కేటీఆర్ (వీడియో)
గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనమిక్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందని టీఎస్ ఐపాస్ ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు.
గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనమిక్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందని టీఎస్ ఐపాస్ ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు.
విజనరీ లీడర్‌షిప్ ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కేటీఆర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు ఉండాలని.. దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా అనుమతులను ఇచ్చామని ఇందులో 8400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు. ఈ చట్టం వచ్చిన తర్వాత సుమారు 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.