వర్ష దిగ్బంధనం: ముంచెత్తుతున్న జోరు వానలు

అల్పపీడనం తోడు రుతుపవనాలు ఏకం కావడంతో తెలుగు రాష్ట్రాలు వానలతో అతలాకుతలం అవుతున్నాయి.

First Published Aug 17, 2020, 4:33 PM IST | Last Updated Aug 17, 2020, 4:33 PM IST

అల్పపీడనం తోడు రుతుపవనాలు ఏకం కావడంతో తెలుగు రాష్ట్రాలు వానలతో అతలాకుతలం అవుతున్నాయి . వరం రోజులుగా గ్యాప్ లేకుండా వానలు కురుస్తున్నాయి . దీనితో వాగులు , నదులు పొంగి పొర్లుతున్నాయి . భారీ వర్షాలతో ప్రాజెక్టులు , జల పాతాలు నీటితో కనువిందు చేస్తున్న మరోవైపు ఎప్పుడు వరదను చూడని గ్రామాలూ ,పట్టణాలుకూడా నీటమునుగుతున్నాయి . ఎగువనుంది వరద నీటి ప్రవాహం తో డ్యాంలు నిండి ప్రమాద స్థాయి దాటుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు . లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమ్యాయి . గోదావరి ఉదృతి పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు