గోల్డ్ స్మగ్లర్స్ అతితెలివి... విదేశాల నుండి బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో చూడండి...

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది.

First Published Feb 20, 2022, 9:58 AM IST | Last Updated Feb 20, 2022, 9:58 AM IST

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. ప్రతిరోజూ విమానాశ్రయంలో విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తూ అనేకమంది పట్టుబడుతున్నారు. ఇలా నిన్న(శనివారం) దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 394 గ్రాముల బంగారం పట్టుబడింది.  దీని విలువ దాదాపు రూ.20 లక్షలు వుంటుంది. 

కస్టమ్స్ తనిఖీ నుండి తప్పించుకునేందుకు ఓ అట్టపెట్టెలో కలిసిపోయేలా బంగారాన్ని దాచి తీసుకువచ్చారు. కానీ అధికారులకు అనుమానం రావడంలో అట్టపెట్టెను చింపి చూడగా లోపల దాచిన బంగారం బయటపడింది. దీంతో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాదీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.