హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్ధిగా శ్రీకళా రెడ్డి? (వీడియో)

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్ధిగా శ్రీకళా రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళశారం నాడు జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే అధికారికంగా శ్రీకళా రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది.

First Published Sep 24, 2019, 3:47 PM IST | Last Updated Sep 24, 2019, 3:47 PM IST

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్ధిగా శ్రీకళా రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళశారం నాడు జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే అధికారికంగా శ్రీకళా రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున శ్రీకళా రెడ్డిని బరిలోకి దింపాలని  బీజేపీ పార్టీ  నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 1999 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ టిక్కెట్టు కోసం శ్రీకళా రెడ్డి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆ ఎన్నికల్లో  టీడీపీ అప్పటి మంత్రి మాధవరెడ్డి చందర్ రావుకు మద్దతు పలికింది. దీంతో శ్రీకళా రెడ్డికి టిక్కెట్టు దక్కలేదు.

ఆ తర్వాత పలు దఫాలు ఆమె కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె ప్రయత్నాలు ఫలించి ఈ సారి శ్రీకళా రెడ్డి బీజేపీ టిక్కెట్టుపై హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం కూడ శ్రీకళా రెడ్డి అభ్యర్ధిత్వంపై మొగ్గు చూపినట్టుగా సమాచారం. శ్రీకళారెడ్డి పేరును అధికారికంగా ఆ పార్టీ ప్రకటించడమే మిగిలి ఉంది.