నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన హుజురాబాద్ పోలీసులు
జూపాక గ్రామానికి చెందిన యువకుడు శనివారం అర్ధరాత్రి రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలో చిక్కుక పోవడంతో కాపాడిన పోలీసులు .
జూపాక గ్రామానికి చెందిన యువకుడు శనివారం అర్ధరాత్రి రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలో చిక్కుక పోవడంతో కాపాడిన పోలీసులు . ఒకవైపు వరద ఉధృతి పెరుగుతుండటం, మరోవైపు తనను రక్షించేందుకు ఎవరూ లేకపోవడంతో హుజురాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ వి మాధవికి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సత్వరం స్పందించిన ఇన్స్పెక్టర్ మాధవి సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని రోప్ (తాడు) సహాయంతో యువకుడిని రక్షించి, పోలీసు వహనం లోనే ఇంటి వద్ద దింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు.