హుజూర్ నగర్ ఉప ఎన్నిక: విజయం కోసం సిద్దాంతాలు చిత్తు (వీడియో)

రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది.

First Published Oct 1, 2019, 6:00 PM IST | Last Updated Oct 1, 2019, 6:00 PM IST

రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. 

తెలంగాణ రాజకీయాల్లో తాజా శక్తి బీజేపీ సైతం దూకుడును ప్రదర్శిస్తోంది. పెరక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడంతో,అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ను బరిలోకి దింపింది. యువతను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సిపిఎం పార్టీ తమ అస్థిత్వాన్ని కాపాడుకొనేందుకు అభ్యర్థిని బరిలోకి దింపింది.