కట్టుకున్న భార్యను పొదల్లోకి లాక్కెళ్ళి... కసాయి భర్త కిరాతకం
ఖమ్మం: పట్టపగలు అందరూ చూస్తుండగానే భార్యను హతమార్చడానికి ప్రయత్నించాడో కసాయి భర్త..
ఖమ్మం: పట్టపగలు అందరూ చూస్తుండగానే భార్యను హతమార్చడానికి ప్రయత్నించాడో కసాయి భర్త. ఖమ్మం పట్టణం టీఎన్జీవోస్ కాలనీలో రోడ్డు పక్కనే ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భార్యను బలవంతంగా రోడ్డుపక్కనున్న చెట్లపోదల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి కిరాతకంగా హత్య చేయబోయాడు. అయితే ఆమె కేకలు విని రోడ్డుపై వెళుతున్నవారు ఆమెను కాపాడారు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.