దారుణం.. భూతవైద్యం పేరుతో బాలింతకు చిత్రహింసలు.. పరిస్థితి విషయం..

కరీంనగర్ జిల్లా... శంకరపట్నం మండలంలో దారుణం జరిగింది.

First Published Aug 1, 2020, 11:51 AM IST | Last Updated Aug 1, 2020, 11:51 AM IST

కరీంనగర్ జిల్లా... శంకరపట్నం మండలంలో దారుణం జరిగింది. దెయ్యం పట్టిందని  ఓ పచ్చి బాలింతని భూత వైద్యం పేరిట అత్తింటివారు చిత్రహింసలు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు మంచిర్యాల జిల్లా కుందరం గ్రమనికి చెందిన మల్లేష్ కి వివాహం జరిగింది. వీరికి రెండు నెలల పసికందు.. అయితే ఇటీవల రజిత కాస్త విచిత్రంగా ప్రవర్తించడంతో దయ్యం పట్టిందంటూ భూత వైద్యుడిని పిలిపించారు. దయ్యం నెపంతో భూతవైద్యుడు రజితను విపరీతంగా కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. ఆమెను కరీంనగర్ లోని ప్రయివేటు హాస్పిటల్ కి తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నారు