JusticeForPriyankaReddy : నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం
ప్రియాంకారెడ్డి దారుణహత్య విషయంలో హోం మినిస్టర్ మహమూద్ అలీని మీడియా చుట్టుముట్టింది.
ప్రియాంకారెడ్డి దారుణహత్య విషయంలో హోం మినిస్టర్ మహమూద్ అలీని మీడియా చుట్టుముట్టింది. చెల్లెకు కాకుండా 100కు కాల్ చేయాల్సింది అన్నఆయన మాటలమీద, ఫిర్యాదు సమయంలో పోలీసుల ప్రవర్తన మీద ప్రశ్నలను సంధించింది. ప్రియాంకారెడ్డికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారంటూ నిలదీసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నింధితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ప్రియాంకారెడ్డి నా కూతురులాంటిది తనకు న్యాయం చేస్తామని మహమూద్ అలీ సమాధానం చెప్పారు.