సింగరేణిలో సమ్మెకు దిగిన అద్దె వాహన యజమానులు...

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో భూనిర్వాసిత అద్దె వాహనాల యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం  నుంచి సమ్మెలోకి దిగారు. 

First Published Jul 6, 2023, 4:45 PM IST | Last Updated Jul 6, 2023, 4:45 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో భూనిర్వాసిత అద్దె వాహనాల యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం  నుంచి సమ్మెలోకి దిగారు. రామగుండం ఏరియా 1, 2, 3 పరిధిలోని అధికారులకు నడిపిస్తున్న 500 వాహనాలను పక్కకు పెట్టి, యజమానులు ఆందోళనకు దిగారు. రామగుండం సింగరేణి సంస్థ ఏరియా-2 జీఎం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో 11 ఏరియాలలో ఇదే పరిస్థితి మొదలైంది. గత ఐదేళ్ల నుంచి పాత పద్ధతినే అద్దె చెల్లింపు, కాల పరిమితి ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా సీఎం పీఎఫ్ కటింగ్ తో తమకు వాహనాల మెయింటెనెన్స్ కావడం లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగరేణి మేనేజ్‌మెంట్ ఇచ్చే అద్దె సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం 12 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.