రోడ్డు ప్రమాదం... గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన పెను ప్రమాదం
నల్గొండ: మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది.
నల్గొండ: మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. కారు వేగంగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా స్టీరింగ్ లాక్ అవ్వడంతో ఎడమవైపు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో గవర్నర్ కు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితం బయటపడ్డారు. నల్గొండ పట్టణంలో పురసన్మానం కార్యక్రమానికి హాజరవడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.