ఉత్తమ్‌కుమార్ ఇంటి వద్ద హై టెన్షన్.. అరెస్టుకు రంగం సిద్ధం..
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో జలదీక్షలకు కాంగ్రెస్ పార్టీ పూనుకున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఉత్తమ్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లనున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్‌లోని పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం నుండి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు నేతలు బయలు దేరనున్నారు. దీంతో వారిని ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.