వరద నీటితో గోదావరి మహోగ్రరూపం... ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం

భద్రాచలం : ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. 

First Published Jul 20, 2023, 1:57 PM IST | Last Updated Jul 20, 2023, 1:57 PM IST

భద్రాచలం : ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు వచ్చిచేరుతుండగంతో గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి, 48 అడుగులకు చేరితో రెండో,  53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇవాళ గోదావరి నీటిమట్టం పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశాలున్నాయి.