భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం... నగరంంలో ఇదీ పరిస్థితి
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షంతో రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీరు చేరుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా గతరాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేట, బోరబండ, మూసాపేట, కూకట్ పల్లి ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరాయి. బోరబండలో అయితే ఉదృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీటిలో వాహనాలు సైతం కొట్టుకుపోయాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.