అన్నదాతలను నిండాముంచిన అకాలవర్షం... కొనుగోలు కేంద్రాలవద్ద తడిసిముద్దయిన వరిధాన్యం

జగిత్యాల: గత రాత్రి తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాతల కంట కన్నీరు మిగిల్చింది. చేతికందివచ్చిన వరి పంటను ఈ వర్షం నీటిపాలు చేసి  రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

First Published May 4, 2022, 12:42 PM IST | Last Updated May 4, 2022, 12:42 PM IST

జగిత్యాల: గత రాత్రి తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాతల కంట కన్నీరు మిగిల్చింది. చేతికందివచ్చిన వరి పంటను ఈ వర్షం నీటిపాలు చేసి  రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇలా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిధిలోనూ అర్ధరాత్రి ఈదురుగాలులలో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో  పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటమునిగింది. ఇలా నీటమునిగిన వరిధాన్యాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు కోతకు వచ్చిన వరి కూడా ఈ ఈదురుగాలుల వర్షంతో నేలవంగిపోయింది. ఇలా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంపై రైతులు పెట్టుకున్న ఆశలపై అకాలవర్షం నీళ్లు చల్లింది. రాత్రి కురిసిన వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప్రభుత్వమే తమను ఆదుకోవాలని నష్టపోయిన అన్నదాతలు కోరుతున్నారు.