కరోనా డేంజర్ బెల్స్... 500జనాభా గల కుగ్రామంలో 53మందికి పాజిటివ్
కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా రెండోదశ కోరలు చాస్తోంది.
కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా రెండోదశ కోరలు చాస్తోంది. చొప్పదండి మండలం పెద్ద కురుమపల్లి అనే ఒక చిన్న గ్రామంలో మొత్తం 500 మంది జనాభా ఉండగా వారిలో 53 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ గ్రామానికి చెందిన 25 మంది ఒగ్గు కళాకారులు పట్నాలు వేయడానికి జగిత్యాల జిల్లా ధర్మారం మండలానికి వెళ్లారు. వారు కరోనా బారిన పడటమే కాదు కుటుంబ సభ్యులు, ఇంటి సమీపంలోని వారికి కూడా వ్యాప్తి చేశారు. ఒకేసారి 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా తమ గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్ విధించినట్లు గ్రామ సర్పంచ్ గంగ మల్లయ్య తెలిపారు.