కుట్రతోనే కవిత అరెస్ట్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు శిక్ష తప్పదు : హరీశ్‌రావు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కవిత్ అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికమని.. ఇది బీజేపీ , కాంగ్రెస్ కుట్ర అని ఆయన ఆరోపించారు. అరెస్ట్‌లు బీఆర్ఎస్‌కు కొత్త కాదని.. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా , న్యాయపరంగా పోరాటం చేస్తామని హరీశ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈడీ కవితను అరెస్ట్ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడానికే కవితను అరెస్ట్ చేశారని హరీశ్ రావు ఆరోపించారు.