కరోనా ఎఫెక్ట్... భక్తులకు దక్కని కొండగట్టు అంజన్న దర్శనభాగ్యం
కొండగట్టు: కరోనా కారణంగా ఏటా అంజన్న కొండపై జరిగే చిన్న జయంతి ఉత్సవాలు ఈసారి అంతరాలయానికే పరిమితమయ్యింది.
కొండగట్టు: కరోనా కారణంగా ఏటా అంజన్న కొండపై జరిగే చిన్న జయంతి ఉత్సవాలు ఈసారి అంతరాలయానికే పరిమితమయ్యింది. ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తులు ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆలయ ఈవో చంద్రశేఖర్ కోరారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో నేడు(మంగళవారం) జరిగే హనుమాన్ చిన్న జయంతికి అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు. స్వామివారి దర్శనంపై ఆంక్షలు విధించిన విషయం తెలియక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొండ దిగువన బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకుని తిప్పి పంపించారు.