మంటగలిసిన మానవత్వం... నడిరోడ్డుపైనే తాతను అతికిరాతకంగా చంపిన మనవడు

జగిత్యాల జిల్లా మేడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు నడిరోడ్డుపై సొంత తాతనే బండరాయితో కొట్టి చంపాడు. ఇలా తాతను మనవడు చంపుతున్న దృశ్యాలు గ్రామ పంచాయితీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.  మేడిపల్లి మండలం లోని కల్వకోట గ్రామంలో ఆది మల్లయ్య (80)అనే వృద్దున్ని అతడి మనవడు చందు(25) బండరాయితో కొట్టి చంపాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బండరాయితో కొట్టిచంపిన మనవడు... తాత చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత తాపీగా బైక్ పై అక్కడి నుండి వెళ్లిపోయాడు. గ్రామస్తులు కళ్లేదుటే ఈ దారుణం జరగ్గా ఆపడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు.
 
First Published Jan 18, 2022, 4:09 PM IST | Last Updated Jan 18, 2022, 4:09 PM IST