గోదావరిఖనిలో దారుణం... సొంత మనవన్ని అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ
పెద్దపల్లి : పెళ్లి కాకుండానే కూతురు కడుపున పుట్టిన బిడ్డను(మనవడు) అమ్మడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యిందో మహిళ.
పెద్దపల్లి : పెళ్లి కాకుండానే కూతురు కడుపున పుట్టిన బిడ్డను(మనవడు) అమ్మడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యిందో మహిళ. కూతురికి తెలియకుండా హాస్పిటల్ నుండే రహస్యంగా చంటిబిడ్డను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి మహిళను సెక్యూరటీ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని ఎన్టీపిసిలో నివాసముండే ఆకాంక్ష ఓ యువకుడి చేతిలో మోసపోయి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఏడురోజుల క్రితమే ఆమె స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆకాంక్షతో పాటే హాస్పిటల్లో వున్న తల్లి రమణమ్మ దారుణానికి ఒడిగట్టింది. బుధవారం(నిన్న) రాత్రి ఆకాంక్ష పడుకున్న తర్వాత బిడ్డను బయటకు తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నించింది రమణమ్మ. అయితే హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకుని శిశువును తిరిగి తల్లి ఒడికి చేర్చారు. కన్న తల్లే తన కడుపున పుట్టిన బిడ్డను అమ్మడానికి ప్రయత్నించిందని తెలిసి ఆకాంక్ష కన్నీటిపర్యంతం అయ్యింది.