గొల్లపల్లి ఠాణాలో కరోనా కలకలం.. హోం క్వారంటైన్ కు 12 మంది..

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 

First Published Jul 2, 2020, 1:24 PM IST | Last Updated Jul 2, 2020, 1:24 PM IST

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. దీంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ రాత్రి ఆయన ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండటంతో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా భార్య, పిల్లలను గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి పుట్టింటికి పంపించాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్‌లో పనిచేసే 12 మంది సిబ్బందిని హోం క్వారెంటైన్‌కు పంపించారు. వారందరి రక్తనమూనాలు గురువారం వరంగల్‌ పంపించనున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి, జగిత్యాల డీఎస్పీ పి.వెంకటరమణ గొల్లపల్లి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ఠాణాను రాత్రి మూసి ఉంచాల్సిందిగా ఆదేశించారు. గురువారం శానిటైజేషన్‌ చేసి ఇన్‌ఛార్జిగా ఉండాలని బుగ్గారం ఎస్‌.ఐ. చిరంజీవిని ఆదేశించారు.