పుట్టమన్నును పూజించే వేడుక బొడ్డెమ్మ (వీడియో)
దసరా నవరాత్రుల్లో తెలంగాణ ప్రాంతంలో ఆడే ప్రత్యేక పండుగ బొడ్డెమ్మ. కన్నెపిల్లల పండుగగా ప్రసిద్ధి. శ్రీ చక్రాన్ని పూజించే పండుగ ఇది. శ్రీ చక్రాన్ని మేరురూపం అంటే కొండలరూపంలో, పృథ్వీరూపం అంటే భూమి రూపంలో రెండు రకాలుగా పూజిస్తారు.

మేరు రూపానికి ప్రతీక బొడ్డెమ్మ. పుట్టమన్నుతో వేసి, తీరొక్క పూలతో అలంకరించి ఆడతారు. బొడ్డెమ్మ నిమజ్జనం తరువాతే బతుకమ్మను పేర్చడం ఆనవాయితీ. బొడ్డెమ్మ ఆడడానికీ ప్రత్యేకమైన పాటలున్నాయి. పూర్వం నుండి ఈ పాటలు జనవాడుకలో తరతరాలకూ వ్యాపిస్తున్నాయి. బొడ్డెమ్మ ప్రాముఖ్యత, పాటలు ఈ వీడియోలో చూడండి.