పసికందును రోడ్డుపై వదలేసిన కసాయి తల్లి
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో కసాయి తల్లి ఆ పిల్లను రోడ్డుపై వదిలేసింది. ఈ దారుణమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోలీసు స్టేష్ కాంపౌండ్ వాల్ పక్కనే చోటు చేసుకుంది. పసికందును గమనించిన పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల ఆరోగ్యంగానే ఉందని వైద్యులు చెప్పారు. పాపను పోలీసు అధికారులు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పసికందును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపావళి అమావాస్య రోజున ఆడపిల్ల పుట్టిందని, ఇది అరిష్టమని భావించి పసికందును వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.