జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఓటర్లు అలా.. అభ్యర్థులు ఇలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచాయి. కార్పొరేటర్ అభ్యర్థులు వీధి వీధీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, మిగతా పార్టీల అభ్యర్థులు అధికార పార్టీని విమర్శిస్తూ తాము అభివృద్ధికి పాటు పడతాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు. దీనికి విరుద్ధంగా ఓటర్లు స్పందిస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదని.. ఇదంతా ఓట్ల కోసమే డ్రామా అంటూ తేల్చేస్తున్నారు.