జీహెచ్ఎంసీ ఎన్నికలు : రణస్థలంగా మారుతున్న హైదరాబాద్...

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడం.. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వేగాన్ని పెంచాయి. 

First Published Nov 25, 2020, 4:51 PM IST | Last Updated Nov 25, 2020, 4:51 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడం.. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వేగాన్ని పెంచాయి. ఏది మాట్లాడితే జనాల్లోకి ఎక్కువగా వెడుతోందన్న దానిపైనే దృష్టి  పెడుతున్నారు. దీంతో చలికాలంలో హైదరాబాద్ హీటెక్కుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర్నుంచి అధికార టీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో దాడి చేస్తున్న బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ కామెంట్‌తో పెద్ద దుమారానికి తెర లేపింది, రాజకీయ అలజడిని సృష్టించింది. దీన్ని అధికార పార్టీ అస్త్రంగా మలుచుకుని రివర్స్‌ అటాక్‌కు దిగింది. కాంగ్రెస్‌ సైతం తానేం తక్కువ కాదని దూకుడు పెంచింది. మరోవైపు ఎంఐఎం సవాల్‌తో గొంతెత్తింది. కౌంటర్‌లు.. అటాక్‌లతో.. భాగ్యనగరం రంగస్థలమైంది. మాటల రణక్షేత్రంగా మారింది.