ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత.. ప్రచారాన్ని అడ్డుకున్నారని గేట్లు దూకారు..
ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్‌సీసీ గేటు వద్ద బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు.. తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు గేట్లు దూకి లోపలికి వెళ్లారు. అయితే తేజస్వీ సూర్యను అడ్డుకున్నారనేది ఫేక్ న్యూస్ అని, అలాంటిదేం జరగలేదని ఈస్ట్ జోన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరిట హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ చేశారు.