టీఆర్ఎస్ పార్టీని వందగజాల కింద బొంద పెట్టాలి.. మాజీ ఎంపీ రాజయ్య...

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఒకదానిమీద మరొకటి ఆరోపణలతో సాగుతోంది. 
 

First Published Nov 25, 2020, 10:49 AM IST | Last Updated Nov 25, 2020, 10:49 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఒకదానిమీద మరొకటి ఆరోపణలతో సాగుతోంది. హబ్సీ గూడలో కాంగ్రెస్ కార్పొరేట్ తరఫున మాజీ ఎంపీ వరంగల్ రాజయ్య ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విశ్వనగరం అని చెప్పి, బురద నగరం చేస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ జనాల చెవుల్లో పువ్వులు పెడుతోందని కాంగ్రెస్ కే ఓటేయాలని కోరారు. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ లు చెప్పేవన్నీ నీటి మూటలే అని.. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి టీఆర్ఎస్ దేనని కారుగుర్తుకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు.