డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు... షెడ్యూల్ రిలీజ్..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్ 4 న కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. రేపట్నుంచి నవంబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రి ముగియనుంది. డిసెంబర్ 3న అవసరమైన కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సారి జీహెచ్ఎంసి మేయర్ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు.