గ్యాస్ సిలిండర్లపై పూలుచల్లూతూ... కుత్భుల్లాపూర్ లో బిఆర్ఎస్ మహిళల నిరసన

హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ(గురువారం) బిఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.

First Published Mar 2, 2023, 4:08 PM IST | Last Updated Mar 2, 2023, 4:08 PM IST

హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ(గురువారం) బిఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.ఇలా హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు.గ్యాస్ సిలిండర్లను తరలించే ఆటోపై పూలుచల్లుతూ వెనక్కి పంపారు.ఇప్పటికే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలతో ఈ భారం మోయలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. డౌన్ డౌన్ మోదీ నినాదాలతో ఆందోళన ప్రాంతం దద్దరిల్లింది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకా మాట్లాడుతూ... పెరిగిన గ్యాస్ ధరలను భరించలేక మహిళలు తిరిగి కట్టెలపొయ్యిపై వండుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పటికే చితికిపోయిన సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని పెంచడం తగదని... వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి డిమాండ్ చేసారు.