సత్యనారాయణా..! నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు : బొత్స పై గంగుల సెటైర్లు
కరీంనగర్ : తెలంగాణ విద్యావ్యవస్థ, పరీక్షలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు.
కరీంనగర్ : తెలంగాణ విద్యావ్యవస్థ, పరీక్షలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. విద్యావ్యవస్థలో తెలంగాణ కేరళను మించిపోతోందని... ఇది చూసి ఓర్వలేకే ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని గంగుల అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసలు గురుకులాలే లేవు... రాష్ట్రాలు వీడిపోయాక ఏపీలో కేవలం 308 గురుకులాలు వుంటే తెలంగాణలో మాత్రం 1009 గురుకుల విద్యాలయాలు వున్నాయన్నారు. ఏపీలో కేవలం 25 వేలమంది మాత్రమే గురుకులాల్లో చదువుకుంటుంటే తెలంగాణలో మాత్రం 67 వేలమంది చదువుకుంటున్నారని అన్నారు. ఈ లెక్కలు చూసాక సత్యనారాయణ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అంటూ గంగుల ఎద్దేవా చేసారు.