Asianet News TeluguAsianet News Telugu

వినాయక చవితికి పెద్ద విగ్రహాలు ఉన్నట్టా.. లేనట్లా ?

గణేష్ పండగ కంటే 4 నెలల ముందు నుండి విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడతారు. కానీ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా పనిచేసేవారు కూడా సొంతూరు వెళ్లడంతో విగ్రహాల తయారీపై కూడా ప్రభావం పడింది. 

గణేష్ పండగ కంటే 4 నెలల ముందు నుండి విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడతారు. కానీ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా పనిచేసేవారు కూడా సొంతూరు వెళ్లడంతో విగ్రహాల తయారీపై కూడా ప్రభావం పడింది. విగ్రహం వ్యాపారం చేసేవారు వాటికోసం లోన్ లు తీసుకోవడం లేదా అప్పులు తెచ్చుకొని, పెద్ద పెద్ద షెడ్లను రెంట్ కి తీసుకొని తయారుచేస్తూ వుంటారు. ఇప్పటికి కరోనా ప్రభావం తగ్గక పోవడం ప్రభుత్వం కూడా ఎటూ తేల్చక పోవడంతో విగ్రహాలను ఎంత ఎత్తు చేయాలి, అసలు ఎన్ని చేయాలో అర్థం కాకుండా ఉందని వ్యాపారస్తులు అంటున్నారు.