కోవిద్ 19 కోసం టోల్ ఫ్రీ నెంబర్.. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ..
హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి కోవిద్ 19 కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి కోవిద్ 19 కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రమంత్రిగా కోవిద్ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం అందిస్తా అన్నారు. తెలంగాణలో కరోనా విజృంభన మీద కేంద్ర బృందం ఈ రోజు పర్యటించింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. నిన్న చెస్ట్ హాస్పిటల్ లో పేషంట్ చనిపోవడం బాధాకరం అని అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు.