దారుణం.. గొంతుకోసి మాజీ ఎంపీటీసీ దంపతుల హత్య..
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దంపతులను గుర్తుతెలియని అగంతకులు గొంతుకోసి హత్యచేశారు. కొండపాక గ్రామానికి చెందిన పూరెల్ల సుశీల, పోశాలు పొలం పనుల కోసం తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి గొంతులుకోసి పరారయ్యారు. దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ దంపతులిద్దరికీ ఇంటి సమీపంలోనే మూడెకరాల భూమి ఉండేదని, ఈ విషయంలో
వేరే వారితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. దీనిపై కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. పొలంలో గెట్ల పంచాయితీ కారణంగా పోశాలు తన ప్రత్యర్థులతో పలు మార్లు తగవు పెట్టుకున్నట్టు స్థానికులు పోలీసులకు వివరించారు.