Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు... భారీ పోలీసుల మొహరింపు

భద్రాచలం : తెలంగాణలో కొనసాగుతున్న పోడు భూముల వివాదం చివరకు ఓ ఫారెస్ట్ అధికారి ప్రాణాలను బలితీసుకుంది.

భద్రాచలం : తెలంగాణలో కొనసాగుతున్న పోడు భూముల వివాదం చివరకు ఓ ఫారెస్ట్ అధికారి ప్రాణాలను బలితీసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా చండ్రగుంట మండలం బెండలపాడులో ఫారెస్ట్ రేంజ్ ఆపీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు స్థానిక గుత్తికోయలు వేట కొడవళ్ళతో నరికి అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతిచెందిన ఎఫ్ఆర్వో అంత్యక్రియలు  రఘునాధపాలెం మండలం ఇర్లపూడిలో జరగనున్నాయి. శ్రీనివాసరావు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాసరావు అంత్యక్రియల నేపథ్యంలో ఇర్లపూడిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఇప్పటికే ఎఫ్ఆర్వో భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, అటవీశాఖ మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక విమానంలో ఖమ్మం చేరుకున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్  దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ తదితరులు కూడా మంత్రుల వెంట ఇర్లపూడికి వెళ్లనున్నారు.