Asianet News TeluguAsianet News Telugu

అమెరికా యువతి నోట తెలుగు పద్యం... తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ అభినందనలు

హైదరబాద్ : తెలుగువాళ్ళమైన మనమే మాతృభాష తెలుగుపై మమకారం చంపుకుని ఇంగ్లీష్ పై మోజు పెంచుకుంటున్నాం.

Jun 30, 2022, 1:17 PM IST

హైదరబాద్ : తెలుగువాళ్ళమైన మనమే మాతృభాష తెలుగుపై మమకారం చంపుకుని ఇంగ్లీష్ పై మోజు పెంచుకుంటున్నాం. ఇలాంటి సమయంలో అమెరికాకు చెందిన యువతి బ్రీ తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తించింది. తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న యువతి ఎంతో కష్టపడి తెలుగులో రాయడం, చదవడమే కాదు అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది. తెలుగు పద్యాలను విదేశీ యువతి నోటినుండి విని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతోంది. ఇలా తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్న విదేశీ యువతిని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ప్రత్యేకంగా అభినందించారు. రవీంద్రభారతికి ఆహ్వానించి ఆమె నోటినుండి చక్కని తెలుగుపద్యాలు విన్నారు. నేటి యువతకు బ్రీ ఆదర్శం కావాలని... తెలుగు భాష ఉన్నతికి ప్రతిఒక్కరు కృషి చేయాలని గౌరీశంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.