Asianet News TeluguAsianet News Telugu

జలదిగ్బంధంలో మేడారం దేవాలయం... నీటమునిగిన సమ్మక్క సారలమ్మల గద్దెలు

భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. 

భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్సాలకు రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో వున్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ వుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
 

Video Top Stories