''సాలు మోడీ సంపకు మోడీ''... హైదరాబాద్ నుండి జిల్లాలకు పాకిన ప్లెక్సీ పాలిటిక్స్
హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించాలనుకుంటున్న తెలంగాణ బిజెపికి అధికార టీఆర్ఎస్ ఊహించని షాక్ లు ఇస్తోంది.
హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించాలనుకుంటున్న తెలంగాణ బిజెపికి అధికార టీఆర్ఎస్ ఊహించని షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే బిజెపి ప్రచారానికి అవకాశం లేకుండా మెట్రో పిల్లర్లు, హోర్డింగులను టీఆర్ఎస్ అభివృద్ది, సంక్షేమ పథకాలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలతో నింపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ వద్ద ''సాలు మోదీ-సంపకు మోదీ #ByeByeMODI'' క్యాప్షన్ తో ప్లెక్సీలు వెలిసాయి. ఈ ప్లెక్సీలు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ వెలుస్తున్నాయి. బై బై మోడీ ట్యాగ్ లైన్ లో మంచిర్యాల జిల్లాల్లో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేసారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కూడళ్లలో మోడీ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి.