1000 పొర్లుదండాలు పెట్టినా గెలవలేవు రాజాసింగ్...: గోషామహల్ లో బిఆర్ఎస్ ప్లెక్సీలు
హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆయన సొంత నియోజకవర్గం గోషామహల్ లో భారీ ప్లెక్సీలు వెలిసాయి.
హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆయన సొంత నియోజకవర్గం గోషామహల్ లో భారీ ప్లెక్సీలు వెలిసాయి. బీఆర్ఎస్ పార్టీ తనను ఓడించేందుకు వెయ్యి కోట్లు ఖర్చుచేసినా... ఓటుకు లక్ష రూపాయలు పంచినా గోషామహల్ ప్రజలు నమ్మరని... ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మళ్లీ గెలిచి చూపిస్తానని రాజాసింగ్ సవాల్ చేసారు. ఈ ఛాలెంజ్ కు కౌంటర్ గానే గోషామహల్ బిఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, జుమెరాత్ బజార్ ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఈసారి రాజాసింగ్ 1000 పొర్లుదండాలు పెట్టినా, రూ.1000 కోట్లు ఖర్చుచేసినా గోషామహల్ ప్రజలు ఓట్లు వేయరని... ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమంటూ బిఆర్ఎస్ నేత ప్లేక్సీలో పేర్కొన్నారు.