వరద నీటిలో చేపలే చేపలు... పట్టుకునేందుకు ఎగబడుతున్న జనాలు
కరీంనగర్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కరీంనగర్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. దీంతో వరదనీరు పొలాల్లోకి, రోడ్లపైకి పారుతుండటంతో వాటిలో కొట్టుకొచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇలా కరీంనగర్ జిల్లాలో వరదనీటిలో కొట్టుకొచ్చిన పెద్దపెద్ద చేపలను పట్టుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. భారీగా చేపలు చిక్కుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలుకూడా చేపలవేట ప్రారంభించారు. పొల్లాల్లో, వాగులోని నీరు ప్రవహించే ప్రాంతాల్లో వలలు వేసిమరీ చేపలు పడుతున్నారు. కొందరు ఒకటిరెండు పెద్ద చేపలు ఇంట్లో వండుకోడానికి తీసుకునివెళుతుంటే మరికొందరు ఏకంగా చేపల అమ్మకాన్నే ప్రారంభించారు.