గోల్డ్ ఫిష్ చేప మా చెరువులో దొరుకడం ఇదే మొదటిసారి మత్సకారుడు

పెద్దపల్లి జిల్లా లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు , కుంటలు నిండి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.

First Published Aug 16, 2020, 11:48 AM IST | Last Updated Aug 16, 2020, 11:48 AM IST

పెద్దపల్లి జిల్లా లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు , కుంటలు నిండి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో ఉన్న ఊరి చెరువులో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి మత్తడి పారుతుంది. గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు మత్తడి వద్ద చేపలు పడుతుండగా  ఒక మత్స్యకారుడి వలలో లైట్ గోల్డ్ కలర్ చేప తన వలలో చిక్కింది,గోల్డ్ ఫిష్ చేప పడిన మత్సకారుడి ఆనందానికి అవధులు లేవు , ఇలాంటి చేప మా ఊర చెరువులో రావడం ఇదే తొలిసారని అన్నారు.చేపను చూస్తూ గ్రామస్థులు మురిసిపోయారు.