Video : చైనా బజార్ పై కన్నెర్రజేసిన అగ్నిదేవుడు
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండల కేంద్రం మెయిన్ రోడ్డు లో ఉన్న చైనా బజార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చైనా బజార్ పూర్తిగా తగలబడింది.
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండల కేంద్రం మెయిన్ రోడ్డు లో ఉన్న చైనా బజార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చైనా బజార్ పూర్తిగా తగలబడింది. మంటలు గమనించిన స్థానికులు మరియు పోలీసులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించగా అందులో ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో అదుపులోకి రాలేదు. దీంతో ఫైర్ ఇంజన్ ని రప్పించి మంటలు అదుపు చేశారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీ ఆస్తినష్టం జరిగింది.