హైదరాబాద్ లో దారుణం... ఇంట్లోనే తండ్రీకొడుకుల దారుణ హత్య
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉప్పల్ లోని హనుమాన్ సాయి నగర్ లోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండుగులు తండ్రి కొడుకులను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలు ఉప్పల్ లో కలకలం రేపాయి.
ఉప్పల్ లో కుటుంబంతో కలిసి జి. నరసింహమూర్తి నివాసముండేవాడు. అతడి కొడుకు శ్రీనివాసమూర్తి ఇటీవల మలేషియా నుండి వచ్చాడు. ఈ తండ్రికొడుకులు ఇంట్లో వుండగా తెల్లవారుజామున ముసుగులు ధరించి వచ్చిన దండుగులు కత్తులతో దాడిచేసి చంపారు. రక్తపుమడుగులో పడిపోయిన వీరు చనిపోయారని నిర్దారించుకుని దుండగులు అక్కడినుండి పరారయ్యారు. పాతకక్షలే ఈ హత్యలకు కారణంగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సిబ్బందితో కలిసి డిసిపి రక్షిత పరిశీంచారు.