జగిత్యాల అష్టదిగ్భంధనం... మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

జగిత్యాల : మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జగిత్యాల పట్టణ చుట్టుపక్కన గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

First Published Jan 19, 2023, 1:27 PM IST | Last Updated Jan 19, 2023, 1:27 PM IST

జగిత్యాల : మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జగిత్యాల పట్టణ చుట్టుపక్కన గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ పచ్చని పొలాలను పరిశ్రమల ఏర్పాటు, రిక్రియేషన్ కోసం కేటాయించడంపై జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో గతకొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలను ఉదృతం చేస్తూ రైతు జేఏసి ఆధ్వర్యంలో ఇవాళ జగిత్యాలను అష్టిదిగ్భంధం చేసారు. జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై అంబారీ పెట్, హస్నాబాద్ గ్రామస్తులు, జగిత్యాల-పెద్దపెల్లి రహదారిపై తిమ్మాపూర్, మోతె గ్రామస్తులు, జగిత్యాల-ధర్మపురి రహదారిపై తిప్పన్నపేట గ్రామస్తులు, జగిత్యాల‌-కరీంనగర్ రహదారిపై ధరూర్ , నర్సింగపూర్ గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి లిఖితపూర్వకంగా
హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని... లేదంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.