జగిత్యాల మాస్టర్ ప్లాన్ వివాదం... బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిముందు మహిళల ఆందోళన
జగిత్యాల : మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జగిత్యాల పట్టణ చుట్టుపక్కన గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
జగిత్యాల : మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జగిత్యాల పట్టణ చుట్టుపక్కన గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ పచ్చని పొలాలను పరిశ్రమల ఏర్పాటు, రిక్రియేషన్ కోసం కేటాయించడంపై నర్సింగాపూర్, తిమ్మాపూర్, మోతె తదితర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఫ్లాన్ జీవో కు వ్యతిరేకంగా ఇవాళ నర్సింగాపూర్ గ్రామ మహిళలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటివద్ద నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ మహిళలు వినతిపత్రం ఇవ్వగా వారికి భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ నుండి పంటపొలాలు తొలగిస్తామని... ఒక్క గుంట భూమి కూడా పోనివ్వనని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే జగిత్యాల:మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల-నిజామాబాద్ హైవేపై రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలను నిలిపేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ సహా వార్డు సభ్యులు రాజీనామా చేశారు. తిప్పన్నపేటకు చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు.