Asianet News TeluguAsianet News Telugu

నకిలీ నోట్ల చలామణి, దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్దనుండి 77,400 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎసిపీ సారంగపాణి కేసు వివరాలు వెల్లడించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు కట్ట వద్ద మాటు వేసి కాల్వశ్రీరాంపూర్ కు చెందిన చల్లా రాయమల్లు, బసంతనగర్  జిడి నగర్ కు చెందిన కొమిరే రాజు, కాల్వశ్రీరాంపూర్ కు చెందిన
దారంగుల వెంకటి లను అదుపు లోకి తీసుకొని 77 వేల 400 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. వారిని విచారించిన అనంతరం కరీంనగర్ లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారనే సమాచారం మేరకు కరీంనగర వెళ్లి కాల్వశ్రీరాంపూర్ కు చెందిన దుగ్యాల అనిల్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు   నకిలీ నోట్లు  ముద్రిస్తున్న ప్రింటర్, స్కానర్, కట్టర్ తో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.