దెయ్యం పట్టిందని బాలింతకు భూత వైద్యం.. చనిపోయిన రజిత..
కరీంనగర్ జిల్లా... శంకరపట్నం మండలంలో భూత వైద్యం పేరుతో బాలింతను హింసించిన ఘటనలో బాధితురాలు రజిత చికిత్స పొందుతూ మరణించింది.
కరీంనగర్ జిల్లా... శంకరపట్నం మండలంలో భూత వైద్యం పేరుతో బాలింతను హింసించిన ఘటనలో బాధితురాలు రజిత చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆమె రెండు నెలల చిన్నారి అనాథగా మారింది. హైదరాబాద్ కు చెందిన రజిత చిన్నతనంలోనే కోల్పోయింది. మల్లేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. రజిత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో ఆమె భర్త మంచిర్యాల, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. కానీ, ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బంధువుల సలహా మేరకు జమ్మికుంటకు చెందిన శ్యాం అనే భూత వైద్యుడితో వైద్యం చేయించారు. అది వికటించి బాలింత మరణానికి దారి తీసింది