హైదరాబాద్ కు ధీటుగా సౌకర్యాలు... ఆందోళన వద్దు: కరోనా పేషెంట్స్ కి మంత్రి భరోసా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వార్డును ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వార్డును ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ముందుగా అత్యవసర సేవల విభాగాన్ని సందర్శించారు. అనంతరం కరోనా వార్డును సందర్శించి ఎంత మంది రోగులు ఉన్నారని? వారికి చికిత్స ఎలా అందిస్తున్నారని? సిబ్బందిని ప్రశ్నించారు. అంతేకాక అందుబాటులో ఉన్న ఆక్సిజన్, మందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైద్రాబాద్ కు ధీటుగా జిల్లాలో ఏర్పాట్లు ఉన్నాయని, ఎవరూ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు.