అర్చకులను హేళన చేయకండి.. చిలుకూరు అర్చకుడు రంగరాజన్..
కరోనా అందరికీ వస్తుంది.. అర్చకులను హేళన చేయవద్దంటూ చిలుకూరు దేవాలయ ప్రధానార్చకుడు రంగరాజన్ విజ్ఞప్తి చేశారు.
కరోనా అందరికీ వస్తుంది.. అర్చకులను హేళన చేయవద్దంటూ చిలుకూరు దేవాలయ ప్రధానార్చకుడు రంగరాజన్ విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడికి వైరస్ సోకడం మీద కొన్ని టీవీ ఛానల్స్ లో హేళనగా చూపించారని అన్నారు. భక్తుల కోసమే అర్చకుడు తన జీవితాన్ని రిస్కులో పెడుతున్నాడని, పోప్ కైనా, ఇమామ్ కైనా ఎవ్వరికైనా కరోనా రావచ్చని అన్నారు. చిలుకూరు దేవాలయం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తెరుచుకోవని మళ్లోసారి గుర్తు చేశారు.